الليل
The Night • 21 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
2ప్రకాశించే పగటి సాక్షిగా!
3మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
4వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;[1]
5కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
6మరియు మంచిని నమ్ముతాడో![1]
7అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.[1]
8కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో![1]
9మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
10అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
11మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
12నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
13మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
14కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.
15పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!
16ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!
17కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!
18అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!
19కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;
20కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!
21మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.[1]