الضحى
The Morning Hours • 11 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా!
2మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా![1]
3(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.
4మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది![1]
5మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.
6(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?
7మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం [1]
8మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా?
9కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;
10మరియు యాచకుణ్ణి కసరుకోకు;
11మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.[1]