Al-Fatiha

الفاتحة

The Opening7 ayahsMeccan

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ﴿١

1అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్[1] పేరుతో[2]

ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ﴿٢

2సర్వలోకాలకు ప్రభువైన[1] అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు[2].

ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ﴿٣

3అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత[1]

مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ﴿٤

4తీర్పుదినానికి[1] స్వామి[2].

إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ﴿٥

5మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.[1]

ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ﴿٦

6మాకు ఋజుమార్గం[1] వైపునకు మార్గదర్శకత్వం చేయి.

صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ﴿٧

7నీవు అనుగ్రహించిన[1] వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి[2] గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.

RELATED SURAHS