الشرح
The Relief • 8 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా?[1]
2మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా?
3ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో?
4మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?[1]
5నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది;
6నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది.[1]
7కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో!
8మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు.