الأعلى
The Most High • 19 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!
2ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.[1]
3మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు[1], మరియు మార్గం చూపాడు!
4మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.
5మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]
6మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -
7అల్లాహ్ కోరింది తప్ప[1]! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
8మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.[1]
9కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]
10(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.
11మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.
12అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.
13అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.[1]
14సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.
15మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.
16అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;
17కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.
18నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;
19ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.