الطارق
The Night Comer • 17 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా![1]
2రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?
3అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.
4కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.
5కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!
6అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.
7అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.
8నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!
9ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!
10అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]
11వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా![1]
12(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!
13నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).
14మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.
15(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.[1]
16మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.
17కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు![1] వారి పట్ల మృదువుగా వ్యవహరించు.