Al-Ghashiyah

الغاشية

The Overwhelming26 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡغَٰشِيَةِ﴿١

1హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా?

وُجُوهٞ يَوۡمَئِذٍ خَٰشِعَةٌ﴿٢

2కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.

عَامِلَةٞ نَّاصِبَةٞ﴿٣

3(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,[1]

تَصۡلَىٰ نَارًا حَامِيَةٗ﴿٤

4వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.

تُسۡقَىٰ مِنۡ عَيۡنٍ ءَانِيَةٖ﴿٥

5వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.

لَّيۡسَ لَهُمۡ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٖ﴿٦

6వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు.

لَّا يُسۡمِنُ وَلَا يُغۡنِي مِن جُوعٖ﴿٧

7అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!

وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاعِمَةٞ﴿٨

8ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి;

لِّسَعۡيِهَا رَاضِيَةٞ﴿٩

9తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.

فِي جَنَّةٍ عَالِيَةٖ﴿١٠

10అత్యున్నతమైన స్వర్గవనంలో.

لَّا تَسۡمَعُ فِيهَا لَٰغِيَةٗ﴿١١

11అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.

فِيهَا عَيۡنٞ جَارِيَةٞ﴿١٢

12అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;

فِيهَا سُرُرٞ مَّرۡفُوعَةٞ﴿١٣

13అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;[1]

وَأَكۡوَابٞ مَّوۡضُوعَةٞ﴿١٤

14మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;

وَنَمَارِقُ مَصۡفُوفَةٞ﴿١٥

15మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;

وَزَرَابِيُّ مَبۡثُوثَةٌ﴿١٦

16మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.

أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلۡإِبِلِ كَيۡفَ خُلِقَتۡ﴿١٧

17ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?

وَإِلَى ٱلسَّمَآءِ كَيۡفَ رُفِعَتۡ﴿١٨

18మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?

وَإِلَى ٱلۡجِبَالِ كَيۡفَ نُصِبَتۡ﴿١٩

19మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?

وَإِلَى ٱلۡأَرۡضِ كَيۡفَ سُطِحَتۡ﴿٢٠

20మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?

فَذَكِّرۡ إِنَّمَآ أَنتَ مُذَكِّرٞ﴿٢١

21కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే!

لَّسۡتَ عَلَيۡهِم بِمُصَيۡطِرٍ﴿٢٢

22నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.

إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ﴿٢٣

23ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!

فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلۡعَذَابَ ٱلۡأَكۡبَرَ﴿٢٤

24అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు.

إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ﴿٢٥

25నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది;

ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم﴿٢٦

26ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!

RELATED SURAHS