البلد
The City • 20 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!
2మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1]
3మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!
4వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.
5ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?
6అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.[1]
7ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?[1]
8ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?
9మరియు నాలుకను మరియు రెండు పెదవులను.
10మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.[1]
11కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు![1]
12మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?
13అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.[1]
14లేదా! (స్వయంగా) ఆకలి గొని[1] ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.
15సమీప అనాథునికి గానీ;
16లేక, దిక్కులేని నిరుపేదకు గానీ![1]
17మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.
18ఇలాంటి వారే కుడిపక్షం వారు.[1]
19ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.
20వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.[1]