الناس
Mankind • 6 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను![1]
2మానవుల సార్వభౌముడు![1]
3మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
4కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
5ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో![1]
6వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు![1]