العاديات
The Chargers • 11 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా![1]
2తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1]
3తెల్లవారుఝామున దాడి చేసేవాటి;[1]
4(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;[1]
5(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
6నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]
7మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
8మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
9ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]
10మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
11నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!