Al-Qari'ah

القارعة

The Striking Calamity11 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡقَارِعَةُ﴿١

1ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం![1]

مَا ٱلۡقَارِعَةُ﴿٢

2ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ﴿٣

3మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?

يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ﴿٤

4ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.[1]

وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ﴿٥

5మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.[1]

فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ﴿٦

6అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]

فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ﴿٧

7అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.

وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ﴿٨

8మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]

فَأُمُّهُۥ هَاوِيَةٞ﴿٩

9అతని నివాసం అధః పాతాళమే.[1]

وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ﴿١٠

10మరియు అది ఏమిటో నీకేం తెలుసు?

نَارٌ حَامِيَةُۢ﴿١١

11అదొక భగభగమండే అగ్ని (గుండం).[1]

RELATED SURAHS