Al-Inshiqaq

الانشقاق

The Splitting Open25 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتۡ﴿١

1ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు![1]

وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ﴿٢

2మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.[1]

وَإِذَا ٱلۡأَرۡضُ مُدَّتۡ﴿٣

3మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;

وَأَلۡقَتۡ مَا فِيهَا وَتَخَلَّتۡ﴿٤

4మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;

وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ﴿٥

5అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.

يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحٗا فَمُلَٰقِيهِ﴿٦

6ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.

فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ﴿٧

7అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;[1]

فَسَوۡفَ يُحَاسَبُ حِسَابٗا يَسِيرٗا﴿٨

8అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.

وَيَنقَلِبُ إِلَىٰٓ أَهۡلِهِۦ مَسۡرُورٗا﴿٩

9మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!

وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهۡرِهِۦ﴿١٠

10ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;[1]

فَسَوۡفَ يَدۡعُواْ ثُبُورٗا﴿١١

11అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;

وَيَصۡلَىٰ سَعِيرًا﴿١٢

12మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.

إِنَّهُۥ كَانَ فِيٓ أَهۡلِهِۦ مَسۡرُورًا﴿١٣

13వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]

إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ﴿١٤

14వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.

بَلَىٰٓۚ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرٗا﴿١٥

15అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.

فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ﴿١٦

16కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]

وَٱلَّيۡلِ وَمَا وَسَقَ﴿١٧

17రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!

وَٱلۡقَمَرِ إِذَا ٱتَّسَقَ﴿١٨

18పూర్ణచంద్రుని సాక్షిగా![1]

لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٖ﴿١٩

19మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]

فَمَا لَهُمۡ لَا يُؤۡمِنُونَ﴿٢٠

20అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?

وَإِذَا قُرِئَ عَلَيۡهِمُ ٱلۡقُرۡءَانُ لَا يَسۡجُدُونَۤ۩﴿٢١

21మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?[1]

بَلِ ٱلَّذِينَ كَفَرُواْ يُكَذِّبُونَ﴿٢٢

22అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.

وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُوعُونَ﴿٢٣

23మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ﴿٢٤

24కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونِۭ﴿٢٥

25విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.

RELATED SURAHS