الانفطار
The Cleaving • 19 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ఆకాశం చీల్చబడినప్పుడు![1]
2మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!
3మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!
4మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!
5ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.
6ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?
7ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.
8తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.
9అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!
10మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.[1]
11వారు, గౌరవనీయులైన లేఖకులు;
12మీరు చేసేదంతా తెలుసుకునేవారు!
13నిశ్చయంగా పుణ్యాత్ములు[1] సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.
14మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.[1]
15తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.
16మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.
17మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
18అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
19ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.[1]