المسد
The Palm Fiber • 5 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక![1]
2అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!
3అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!
4మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]
5ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]