الفيل
The Elephant • 5 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
2ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?[1]
3మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
4అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;[1]
5ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.