الهمزة
The Gossipmonger • 9 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.[1]
2ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో![1]
3తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు![1]
4ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.[1]
5ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]
6అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;
7అది గుండెల దాకా చేరుకుంటుంది.
8నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.[1]
9పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!