An-Naba

النبأ

The Tidings40 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

عَمَّ يَتَسَآءَلُونَ﴿١

1ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1]

عَنِ ٱلنَّبَإِ ٱلۡعَظِيمِ﴿٢

2ఆ మహా వార్తను గురించేనా?

ٱلَّذِي هُمۡ فِيهِ مُخۡتَلِفُونَ﴿٣

3దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?

كَلَّا سَيَعۡلَمُونَ﴿٤

4అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

ثُمَّ كَلَّا سَيَعۡلَمُونَ﴿٥

5ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ مِهَٰدٗا﴿٦

6ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?

وَٱلۡجِبَالَ أَوۡتَادٗا﴿٧

7మరియు పర్వతాలను మేకులుగా?[1]

وَخَلَقۡنَٰكُمۡ أَزۡوَٰجٗا﴿٨

8మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1]

وَجَعَلۡنَا نَوۡمَكُمۡ سُبَاتٗا﴿٩

9మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.

وَجَعَلۡنَا ٱلَّيۡلَ لِبَاسٗا﴿١٠

10మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.

وَجَعَلۡنَا ٱلنَّهَارَ مَعَاشٗا﴿١١

11మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.

وَبَنَيۡنَا فَوۡقَكُمۡ سَبۡعٗا شِدَادٗا﴿١٢

12మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.

وَجَعَلۡنَا سِرَاجٗا وَهَّاجٗا﴿١٣

13మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.

وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءٗ ثَجَّاجٗا﴿١٤

14మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1]

لِّنُخۡرِجَ بِهِۦ حَبّٗا وَنَبَاتٗا﴿١٥

15దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!

وَجَنَّٰتٍ أَلۡفَافًا﴿١٦

16మరియు దట్టమైన తోటలను.

إِنَّ يَوۡمَ ٱلۡفَصۡلِ كَانَ مِيقَٰتٗا﴿١٧

17నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1]

يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَتَأۡتُونَ أَفۡوَاجٗا﴿١٨

18ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.

وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ أَبۡوَٰبٗا﴿١٩

19మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;

وَسُيِّرَتِ ٱلۡجِبَالُ فَكَانَتۡ سَرَابًا﴿٢٠

20మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.[1]

إِنَّ جَهَنَّمَ كَانَتۡ مِرۡصَادٗا﴿٢١

21నిశ్చయంగా, నరకం ఒక మాటు;

لِّلطَّٰغِينَ مَـَٔابٗا﴿٢٢

22ధిక్కారుల గమ్యస్థానం;

لَّٰبِثِينَ فِيهَآ أَحۡقَابٗا﴿٢٣

23అందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1]

لَّا يَذُوقُونَ فِيهَا بَرۡدٗا وَلَا شَرَابًا﴿٢٤

24అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.

إِلَّا حَمِيمٗا وَغَسَّاقٗا﴿٢٥

25సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1]

جَزَآءٗ وِفَاقًا﴿٢٦

26(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!

إِنَّهُمۡ كَانُواْ لَا يَرۡجُونَ حِسَابٗا﴿٢٧

27వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.

وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا كِذَّابٗا﴿٢٨

28పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.

وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ كِتَٰبٗا﴿٢٩

29మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1]

فَذُوقُواْ فَلَن نَّزِيدَكُمۡ إِلَّا عَذَابًا﴿٣٠

30కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1]

إِنَّ لِلۡمُتَّقِينَ مَفَازًا﴿٣١

31నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;

حَدَآئِقَ وَأَعۡنَٰبٗا﴿٣٢

32ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!

وَكَوَاعِبَ أَتۡرَابٗا﴿٣٣

33మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;

وَكَأۡسٗا دِهَاقٗا﴿٣٤

34మరియు నిండి పొర్లే (మధు) పాత్ర

لَّا يَسۡمَعُونَ فِيهَا لَغۡوٗا وَلَا كِذَّٰبٗا﴿٣٥

35అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.

جَزَآءٗ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابٗا﴿٣٦

36(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.

رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلرَّحۡمَٰنِۖ لَا يَمۡلِكُونَ مِنۡهُ خِطَابٗا﴿٣٧

37భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.

يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَٰٓئِكَةُ صَفّٗاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابٗا﴿٣٨

38ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.[2]

ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلۡحَقُّۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا﴿٣٩

39అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [1]

إِنَّآ أَنذَرۡنَٰكُمۡ عَذَابٗا قَرِيبٗا يَوۡمَ يَنظُرُ ٱلۡمَرۡءُ مَا قَدَّمَتۡ يَدَاهُ وَيَقُولُ ٱلۡكَافِرُ يَٰلَيۡتَنِي كُنتُ تُرَٰبَۢا﴿٤٠

40నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు.

RELATED SURAHS