Al-Muddaththir

المدثر

The Cloaked One56 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ﴿١

1ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!

قُمۡ فَأَنذِرۡ﴿٢

2లే! ఇక హెచ్చరించు!

وَرَبَّكَ فَكَبِّرۡ﴿٣

3మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!

وَثِيَابَكَ فَطَهِّرۡ﴿٤

4మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!

وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ﴿٥

5మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!

وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ﴿٦

6మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!

وَلِرَبِّكَ فَٱصۡبِرۡ﴿٧

7మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!

فَإِذَا نُقِرَ فِي ٱلنَّاقُورِ﴿٨

8మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;

فَذَٰلِكَ يَوۡمَئِذٖ يَوۡمٌ عَسِيرٌ﴿٩

9ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;

عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ﴿١٠

10సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు[1].

ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا﴿١١

11వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ[1]!

وَجَعَلۡتُ لَهُۥ مَالٗا مَّمۡدُودٗا﴿١٢

12మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.

وَبَنِينَ شُهُودٗا﴿١٣

13మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!

وَمَهَّدتُّ لَهُۥ تَمۡهِيدٗا﴿١٤

14మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.

ثُمَّ يَطۡمَعُ أَنۡ أَزِيدَ﴿١٥

15అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.

كَلَّآۖ إِنَّهُۥ كَانَ لِأٓيَٰتِنَا عَنِيدٗا﴿١٦

16అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.

سَأُرۡهِقُهُۥ صَعُودًا﴿١٧

17నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!

إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ﴿١٨

18వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.

فَقُتِلَ كَيۡفَ قَدَّرَ﴿١٩

19కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!

ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ﴿٢٠

20అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!

ثُمَّ نَظَرَ﴿٢١

21అప్పుడు అతడు ఆలోచించాడు.

ثُمَّ عَبَسَ وَبَسَرَ﴿٢٢

22తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);

ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ﴿٢٣

23తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు[1].

فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ يُؤۡثَرُ﴿٢٤

24అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!

إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ﴿٢٥

25ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే

سَأُصۡلِيهِ سَقَرَ﴿٢٦

26త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.

وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ﴿٢٧

27మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు[1]?

لَا تُبۡقِي وَلَا تَذَرُ﴿٢٨

28అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].

لَوَّاحَةٞ لِّلۡبَشَرِ﴿٢٩

29అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది[1].

عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ﴿٣٠

30దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.

وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ﴿٣١

31మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు[1]. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.

كَلَّا وَٱلۡقَمَرِ﴿٣٢

32అలా కాదు! చంద్రుని సాక్షిగా!

وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ﴿٣٣

33గడిచిపోయే రాత్రి సాక్షిగా!

وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ﴿٣٤

34ప్రకాశించే, ఉదయం సాక్షిగా!

إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ﴿٣٥

35నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.

نَذِيرٗا لِّلۡبَشَرِ﴿٣٦

36మానవునికి ఒక హెచ్చరిక;

لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ﴿٣٧

37మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;

كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ﴿٣٨

38ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.

إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ﴿٣٩

39కుడిపక్షం వారు తప్ప!

فِي جَنَّٰتٖ يَتَسَآءَلُونَ﴿٤٠

40వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!

عَنِ ٱلۡمُجۡرِمِينَ﴿٤١

41అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):

مَا سَلَكَكُمۡ فِي سَقَرَ﴿٤٢

42"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"

قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ﴿٤٣

43వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.

وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ﴿٤٤

44మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;

وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ﴿٤٥

45మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;

وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ﴿٤٦

46మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;

حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ﴿٤٧

47చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది[1].

فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ﴿٤٨

48అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు[1].

فَمَا لَهُمۡ عَنِ ٱلتَّذۡكِرَةِ مُعۡرِضِينَ﴿٤٩

49అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.

كَأَنَّهُمۡ حُمُرٞ مُّسۡتَنفِرَةٞ﴿٥٠

50వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;

فَرَّتۡ مِن قَسۡوَرَةِۭ﴿٥١

51సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)[1]!

بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفٗا مُّنَشَّرَةٗ﴿٥٢

52అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు[1].

كَلَّاۖ بَل لَّا يَخَافُونَ ٱلۡأٓخِرَةَ﴿٥٣

53కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.

كَلَّآ إِنَّهُۥ تَذۡكِرَةٞ﴿٥٤

54అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.

فَمَن شَآءَ ذَكَرَهُۥ﴿٥٥

55కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.

وَمَا يَذۡكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ هُوَ أَهۡلُ ٱلتَّقۡوَىٰ وَأَهۡلُ ٱلۡمَغۡفِرَةِ﴿٥٦

56కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు[1].

RELATED SURAHS