Al-Waqi'ah

الواقعة

The Event96 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ﴿١

1ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1]

لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ﴿٢

2అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.

خَافِضَةٞ رَّافِعَةٌ﴿٣

3అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1].

إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجّٗا﴿٤

4భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;

وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسّٗا﴿٥

5మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;

فَكَانَتۡ هَبَآءٗ مُّنۢبَثّٗا﴿٦

6అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;

وَكُنتُمۡ أَزۡوَٰجٗا ثَلَٰثَةٗ﴿٧

7మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.

فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ﴿٨

8ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1]

وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ﴿٩

9మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1]

وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ﴿١٠

10మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.

أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ﴿١١

11అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.

فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ﴿١٢

12వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.

ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ﴿١٣

13మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;

وَقَلِيلٞ مِّنَ ٱلۡأٓخِرِينَ﴿١٤

14మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.

عَلَىٰ سُرُرٖ مَّوۡضُونَةٖ﴿١٥

15(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;

مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ﴿١٦

16ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1]

يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٞ مُّخَلَّدُونَ﴿١٧

17వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.

بِأَكۡوَابٖ وَأَبَارِيقَ وَكَأۡسٖ مِّن مَّعِينٖ﴿١٨

18(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!

لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ﴿١٩

19దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.

وَفَٰكِهَةٖ مِّمَّا يَتَخَيَّرُونَ﴿٢٠

20మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.

وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ﴿٢١

21మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]

وَحُورٌ عِينٞ﴿٢٢

22మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);

كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ﴿٢٣

23దాచబడిన ముత్యాల వలే!

جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ﴿٢٤

24ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!

لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوٗا وَلَا تَأۡثِيمًا﴿٢٥

25అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.[1]

إِلَّا قِيلٗا سَلَٰمٗا سَلَٰمٗا﴿٢٦

26"శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప![1]

وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ﴿٢٧

27మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!

فِي سِدۡرٖ مَّخۡضُودٖ﴿٢٨

28వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య ![1]

وَطَلۡحٖ مَّنضُودٖ﴿٢٩

29మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;

وَظِلّٖ مَّمۡدُودٖ﴿٣٠

30మరియు వ్యాపించి ఉన్న నీడలు,[1]

وَمَآءٖ مَّسۡكُوبٖ﴿٣١

31మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;

وَفَٰكِهَةٖ كَثِيرَةٖ﴿٣٢

32మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;

لَّا مَقۡطُوعَةٖ وَلَا مَمۡنُوعَةٖ﴿٣٣

33ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);

وَفُرُشٖ مَّرۡفُوعَةٍ﴿٣٤

34మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]

إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءٗ﴿٣٥

35నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;

فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا﴿٣٦

36మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]

عُرُبًا أَتۡرَابٗا﴿٣٧

37వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);[1]

لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ﴿٣٨

38కుడిపక్షం వారి కొరకు.

ثُلَّةٞ مِّنَ ٱلۡأَوَّلِينَ﴿٣٩

39అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;

وَثُلَّةٞ مِّنَ ٱلۡأٓخِرِينَ﴿٤٠

40మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.

وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ﴿٤١

41ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?

فِي سَمُومٖ وَحَمِيمٖ﴿٤٢

42వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో;

وَظِلّٖ مِّن يَحۡمُومٖ﴿٤٣

43మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).

لَّا بَارِدٖ وَلَا كَرِيمٍ﴿٤٤

44అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;

إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ﴿٤٥

45నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;

وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ﴿٤٦

46మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;

وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابٗا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ﴿٤٧

47మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?

أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ﴿٤٨

48మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?

قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ﴿٤٩

49వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!

لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمٖ مَّعۡلُومٖ﴿٥٠

50వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.

ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ﴿٥١

51ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!

لَأٓكِلُونَ مِن شَجَرٖ مِّن زَقُّومٖ﴿٥٢

52మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.[1]

فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ﴿٥٣

53దానితో కడుపులు నింపుకుంటారు.

فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ﴿٥٤

54తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.

فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ﴿٥٥

55వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.

هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ﴿٥٦

56తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!

نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ﴿٥٧

57మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?

أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ﴿٥٨

58ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?

ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ﴿٥٩

59ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?

نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ﴿٦٠

60మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;

عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ﴿٦١

61మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.

وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ﴿٦٢

62మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?

أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ﴿٦٣

63మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?

ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ﴿٦٤

64మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?

لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمٗا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ﴿٦٥

65మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."

إِنَّا لَمُغۡرَمُونَ﴿٦٦

66(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!

بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ﴿٦٧

67కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని.

أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ﴿٦٨

68ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?

ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ﴿٦٩

69మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?

لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجٗا فَلَوۡلَا تَشۡكُرُونَ﴿٧٠

70మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?

أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ﴿٧١

71మీరు రాజేసే అగ్నిని గమనించారా?

ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ﴿٧٢

72దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?[1]

نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةٗ وَمَتَٰعٗا لِّلۡمُقۡوِينَ﴿٧٣

73మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.[1]

فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ﴿٧٤

74కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.

۞ فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ﴿٧٥

75ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.

وَإِنَّهُۥ لَقَسَمٞ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ﴿٧٦

76మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!

إِنَّهُۥ لَقُرۡءَانٞ كَرِيمٞ﴿٧٧

77నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.

فِي كِتَٰبٖ مَّكۡنُونٖ﴿٧٨

78సురక్షితమైన[1] గ్రంథంలో ఉన్నది.

لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ﴿٧٩

79దానిని[1] పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.

تَنزِيلٞ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ﴿٨٠

80ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.

أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ﴿٨١

81ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?

وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ﴿٨٢

82మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]

فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ﴿٨٣

83అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?

وَأَنتُمۡ حِينَئِذٖ تَنظُرُونَ﴿٨٤

84మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.

وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ﴿٨٥

85మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.[1]

فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ﴿٨٦

86ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;

تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ﴿٨٧

87మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?

فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ﴿٨٨

88కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే![1]

فَرَوۡحٞ وَرَيۡحَانٞ وَجَنَّتُ نَعِيمٖ﴿٨٩

89అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.

وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ﴿٩٠

90మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో![1]

فَسَلَٰمٞ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ﴿٩١

91అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).

وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ﴿٩٢

92మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో![1]

فَنُزُلٞ مِّنۡ حَمِيمٖ﴿٩٣

93అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.

وَتَصۡلِيَةُ جَحِيمٍ﴿٩٤

94మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.

إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ﴿٩٥

95నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!

فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ﴿٩٦

96కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.[1]

RELATED SURAHS