Al-Anbiya

الأنبياء

The Prophets112 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱقۡتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمۡ وَهُمۡ فِي غَفۡلَةٖ مُّعۡرِضُونَ﴿١

1మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.[1]

مَا يَأۡتِيهِم مِّن ذِكۡرٖ مِّن رَّبِّهِم مُّحۡدَثٍ إِلَّا ٱسۡتَمَعُوهُ وَهُمۡ يَلۡعَبُونَ﴿٢

2(కావున) వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు.

لَاهِيَةٗ قُلُوبُهُمۡۗ وَأَسَرُّواْ ٱلنَّجۡوَى ٱلَّذِينَ ظَلَمُواْ هَلۡ هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡۖ أَفَتَأۡتُونَ ٱلسِّحۡرَ وَأَنتُمۡ تُبۡصِرُونَ﴿٣

3వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా?[1] అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో[2] చిక్కుకుపోయారా?"

قَالَ رَبِّي يَعۡلَمُ ٱلۡقَوۡلَ فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ﴿٤

4(ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

بَلۡ قَالُوٓاْ أَضۡغَٰثُ أَحۡلَٰمِۭ بَلِ ٱفۡتَرَىٰهُ بَلۡ هُوَ شَاعِرٞ فَلۡيَأۡتِنَا بِـَٔايَةٖ كَمَآ أُرۡسِلَ ٱلۡأَوَّلُونَ﴿٥

5అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!"

مَآ ءَامَنَتۡ قَبۡلَهُم مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَآۖ أَفَهُمۡ يُؤۡمِنُونَ﴿٦

6మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా?

وَمَآ أَرۡسَلۡنَا قَبۡلَكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِمۡۖ فَسۡـَٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ﴿٧

7మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి.

وَمَا جَعَلۡنَٰهُمۡ جَسَدٗا لَّا يَأۡكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُواْ خَٰلِدِينَ﴿٨

8మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు.[1]

ثُمَّ صَدَقۡنَٰهُمُ ٱلۡوَعۡدَ فَأَنجَيۡنَٰهُمۡ وَمَن نَّشَآءُ وَأَهۡلَكۡنَا ٱلۡمُسۡرِفِينَ﴿٩

9ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము.

لَقَدۡ أَنزَلۡنَآ إِلَيۡكُمۡ كِتَٰبٗا فِيهِ ذِكۡرُكُمۡۚ أَفَلَا تَعۡقِلُونَ﴿١٠

10(ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

وَكَمۡ قَصَمۡنَا مِن قَرۡيَةٖ كَانَتۡ ظَالِمَةٗ وَأَنشَأۡنَا بَعۡدَهَا قَوۡمًا ءَاخَرِينَ﴿١١

11మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము![1]

فَلَمَّآ أَحَسُّواْ بَأۡسَنَآ إِذَا هُم مِّنۡهَا يَرۡكُضُونَ﴿١٢

12మా శిక్ష (రావటం) తెలుసుకున్నప్పుడు వారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నంచేవారు.

لَا تَرۡكُضُواْ وَٱرۡجِعُوٓاْ إِلَىٰ مَآ أُتۡرِفۡتُمۡ فِيهِ وَمَسَٰكِنِكُمۡ لَعَلَّكُمۡ تُسۡـَٔلُونَ﴿١٣

13(అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు - ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!"

قَالُواْ يَٰوَيۡلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ﴿١٤

14వారన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము."

فَمَا زَالَت تِّلۡكَ دَعۡوَىٰهُمۡ حَتَّىٰ جَعَلۡنَٰهُمۡ حَصِيدًا خَٰمِدِينَ﴿١٥

15ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి అరపు ఆగలేదు.

وَمَا خَلَقۡنَا ٱلسَّمَآءَ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا لَٰعِبِينَ﴿١٦

16మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు.

لَوۡ أَرَدۡنَآ أَن نَّتَّخِذَ لَهۡوٗا لَّٱتَّخَذۡنَٰهُ مِن لَّدُنَّآ إِن كُنَّا فَٰعِلِينَ﴿١٧

17ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచుకుంటే, మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలా చేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే![1]

بَلۡ نَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَى ٱلۡبَٰطِلِ فَيَدۡمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٞۚ وَلَكُمُ ٱلۡوَيۡلُ مِمَّا تَصِفُونَ﴿١٨

18అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు.

وَلَهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ﴿١٩

19మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు. [1]

يُسَبِّحُونَ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ لَا يَفۡتُرُونَ﴿٢٠

20వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు.

أَمِ ٱتَّخَذُوٓاْ ءَالِهَةٗ مِّنَ ٱلۡأَرۡضِ هُمۡ يُنشِرُونَ﴿٢١

21ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చనిపోయిన వారిని) మరల బ్రతికించి లేపగలవా?[1]

لَوۡ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَاۚ فَسُبۡحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ﴿٢٢

22వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.[1]

لَا يُسۡـَٔلُ عَمَّا يَفۡعَلُ وَهُمۡ يُسۡـَٔلُونَ﴿٢٣

23తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.

أَمِ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗۖ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡۖ هَٰذَا ذِكۡرُ مَن مَّعِيَ وَذِكۡرُ مَن قَبۡلِيۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ٱلۡحَقَّۖ فَهُم مُّعۡرِضُونَ﴿٢٤

24ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు.

وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِيٓ إِلَيۡهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدُونِ﴿٢٥

25మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.

وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۚ بَلۡ عِبَادٞ مُّكۡرَمُونَ﴿٢٦

26వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"[1]

لَا يَسۡبِقُونَهُۥ بِٱلۡقَوۡلِ وَهُم بِأَمۡرِهِۦ يَعۡمَلُونَ﴿٢٧

27వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.[1]

يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَلَا يَشۡفَعُونَ إِلَّا لِمَنِ ٱرۡتَضَىٰ وَهُم مِّنۡ خَشۡيَتِهِۦ مُشۡفِقُونَ﴿٢٨

28ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, అంతా తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు.[1] వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.

۞ وَمَن يَقُلۡ مِنۡهُمۡ إِنِّيٓ إِلَٰهٞ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجۡزِيهِ جَهَنَّمَۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلظَّٰلِمِينَ﴿٢٩

29వారిలో (దేవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము.[1] మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము.

أَوَلَمۡ يَرَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ كَانَتَا رَتۡقٗا فَفَتَقۡنَٰهُمَاۖ وَجَعَلۡنَا مِنَ ٱلۡمَآءِ كُلَّ شَيۡءٍ حَيٍّۚ أَفَلَا يُؤۡمِنُونَ﴿٣٠

30ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని?[1] మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము.[2] ఇకనైన వారు విశ్వసించరా?

وَجَعَلۡنَا فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِهِمۡ وَجَعَلۡنَا فِيهَا فِجَاجٗا سُبُلٗا لَّعَلَّهُمۡ يَهۡتَدُونَ﴿٣١

31మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము.[1] మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము.

وَجَعَلۡنَا ٱلسَّمَآءَ سَقۡفٗا مَّحۡفُوظٗاۖ وَهُمۡ عَنۡ ءَايَٰتِهَا مُعۡرِضُونَ﴿٣٢

32మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము.[1] అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.

وَهُوَ ٱلَّذِي خَلَقَ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ فِي فَلَكٖ يَسۡبَحُونَ﴿٣٣

33మరియు రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి.

وَمَا جَعَلۡنَا لِبَشَرٖ مِّن قَبۡلِكَ ٱلۡخُلۡدَۖ أَفَإِيْن مِّتَّ فَهُمُ ٱلۡخَٰلِدُونَ﴿٣٤

34మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు.[1] ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా? [2]

كُلُّ نَفۡسٖ ذَآئِقَةُ ٱلۡمَوۡتِۗ وَنَبۡلُوكُم بِٱلشَّرِّ وَٱلۡخَيۡرِ فِتۡنَةٗۖ وَإِلَيۡنَا تُرۡجَعُونَ﴿٣٥

35ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము.[1] మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.

وَإِذَا رَءَاكَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِي يَذۡكُرُ ءَالِهَتَكُمۡ وَهُم بِذِكۡرِ ٱلرَّحۡمَٰنِ هُمۡ كَٰفِرُونَ﴿٣٦

36మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా మీతో పరహాసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు):[1] "ఏమీ? మీ ఆరాధ్యదైవాలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?" ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు! వారే సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.

خُلِقَ ٱلۡإِنسَٰنُ مِنۡ عَجَلٖۚ سَأُوْرِيكُمۡ ءَايَٰتِي فَلَا تَسۡتَعۡجِلُونِ﴿٣٧

37మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు.[1] త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.[2]

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ﴿٣٨

38మరియు వారంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెదిరింపు) ఎప్పుడు నెరవేరనున్నది.[1]

لَوۡ يَعۡلَمُ ٱلَّذِينَ كَفَرُواْ حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ ٱلنَّارَ وَلَا عَن ظُهُورِهِمۡ وَلَا هُمۡ يُنصَرُونَ﴿٣٩

39ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు.

بَلۡ تَأۡتِيهِم بَغۡتَةٗ فَتَبۡهَتُهُمۡ فَلَا يَسۡتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمۡ يُنظَرُونَ﴿٤٠

40వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది.[1] వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

وَلَقَدِ ٱسۡتُهۡزِئَ بِرُسُلٖ مِّن قَبۡلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُواْ مِنۡهُم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ﴿٤١

41మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది.[1]

قُلۡ مَن يَكۡلَؤُكُم بِٱلَّيۡلِ وَٱلنَّهَارِ مِنَ ٱلرَّحۡمَٰنِۚ بَلۡ هُمۡ عَن ذِكۡرِ رَبِّهِم مُّعۡرِضُونَ﴿٤٢

42ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు.

أَمۡ لَهُمۡ ءَالِهَةٞ تَمۡنَعُهُم مِّن دُونِنَاۚ لَا يَسۡتَطِيعُونَ نَصۡرَ أَنفُسِهِمۡ وَلَا هُم مِّنَّا يُصۡحَبُونَ﴿٤٣

43లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు.

بَلۡ مَتَّعۡنَا هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمۡ حَتَّىٰ طَالَ عَلَيۡهِمُ ٱلۡعُمُرُۗ أَفَلَا يَرَوۡنَ أَنَّا نَأۡتِي ٱلۡأَرۡضَ نَنقُصُهَا مِنۡ أَطۡرَافِهَآۚ أَفَهُمُ ٱلۡغَٰلِبُونَ﴿٤٤

44అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని , దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని?[1] అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?

قُلۡ إِنَّمَآ أُنذِرُكُم بِٱلۡوَحۡيِۚ وَلَا يَسۡمَعُ ٱلصُّمُّ ٱلدُّعَآءَ إِذَا مَا يُنذَرُونَ﴿٤٥

45(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా!

وَلَئِن مَّسَّتۡهُمۡ نَفۡحَةٞ مِّنۡ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَٰوَيۡلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ﴿٤٦

46మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు.

وَنَضَعُ ٱلۡمَوَٰزِينَ ٱلۡقِسۡطَ لِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ فَلَا تُظۡلَمُ نَفۡسٞ شَيۡـٔٗاۖ وَإِن كَانَ مِثۡقَالَ حَبَّةٖ مِّنۡ خَرۡدَلٍ أَتَيۡنَا بِهَاۗ وَكَفَىٰ بِنَا حَٰسِبِينَ﴿٤٧

47మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!

وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَىٰ وَهَٰرُونَ ٱلۡفُرۡقَانَ وَضِيَآءٗ وَذِكۡرٗا لِّلۡمُتَّقِينَ﴿٤٨

48మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను.[1]

ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ وَهُم مِّنَ ٱلسَّاعَةِ مُشۡفِقُونَ﴿٤٩

49వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![1] మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!

وَهَٰذَا ذِكۡرٞ مُّبَارَكٌ أَنزَلۡنَٰهُۚ أَفَأَنتُمۡ لَهُۥ مُنكِرُونَ﴿٥٠

50మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ఆన్ ను) మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా?

۞ وَلَقَدۡ ءَاتَيۡنَآ إِبۡرَٰهِيمَ رُشۡدَهُۥ مِن قَبۡلُ وَكُنَّا بِهِۦ عَٰلِمِينَ﴿٥١

51మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.[1]

إِذۡ قَالَ لِأَبِيهِ وَقَوۡمِهِۦ مَا هَٰذِهِ ٱلتَّمَاثِيلُ ٱلَّتِيٓ أَنتُمۡ لَهَا عَٰكِفُونَ﴿٥٢

52అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?"

قَالُواْ وَجَدۡنَآ ءَابَآءَنَا لَهَا عَٰبِدِينَ﴿٥٣

53వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము."

قَالَ لَقَدۡ كُنتُمۡ أَنتُمۡ وَءَابَآؤُكُمۡ فِي ضَلَٰلٖ مُّبِينٖ﴿٥٤

54(ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రితాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు."

قَالُوٓاْ أَجِئۡتَنَا بِٱلۡحَقِّ أَمۡ أَنتَ مِنَ ٱللَّٰعِبِينَ﴿٥٥

55వారన్నారు: "ఏమీ? నీవు మా వద్దకు ఏదైనా సత్యాన్ని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహాసమాడుతున్నావా?"

قَالَ بَل رَّبُّكُمۡ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلَّذِي فَطَرَهُنَّ وَأَنَا۠ عَلَىٰ ذَٰلِكُم مِّنَ ٱلشَّٰهِدِينَ﴿٥٦

56(ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను.

وَتَٱللَّهِ لَأَكِيدَنَّ أَصۡنَٰمَكُم بَعۡدَ أَن تُوَلُّواْ مُدۡبِرِينَ﴿٥٧

57"మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతాను."

فَجَعَلَهُمۡ جُذَٰذًا إِلَّا كَبِيرٗا لَّهُمۡ لَعَلَّهُمۡ إِلَيۡهِ يَرۡجِعُونَ﴿٥٨

58తరువాత అతను ఒక పెద్ద దానిని (విగ్రహాన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని!

قَالُواْ مَن فَعَلَ هَٰذَا بِـَٔالِهَتِنَآ إِنَّهُۥ لَمِنَ ٱلظَّٰلِمِينَ﴿٥٩

59వారన్నారు: "మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించినవాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు."

قَالُواْ سَمِعۡنَا فَتٗى يَذۡكُرُهُمۡ يُقَالُ لَهُۥٓ إِبۡرَٰهِيمُ﴿٦٠

60(కొందరు) ఇలా అన్నారు; "ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము."

قَالُواْ فَأۡتُواْ بِهِۦ عَلَىٰٓ أَعۡيُنِ ٱلنَّاسِ لَعَلَّهُمۡ يَشۡهَدُونَ﴿٦١

61(ఇతరులు) అన్నారు: "అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమో!"

قَالُوٓاْ ءَأَنتَ فَعَلۡتَ هَٰذَا بِـَٔالِهَتِنَا يَٰٓإِبۡرَٰهِيمُ﴿٦٢

62(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు?"

قَالَ بَلۡ فَعَلَهُۥ كَبِيرُهُمۡ هَٰذَا فَسۡـَٔلُوهُمۡ إِن كَانُواْ يَنطِقُونَ﴿٦٣

63(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: "కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి!"

فَرَجَعُوٓاْ إِلَىٰٓ أَنفُسِهِمۡ فَقَالُوٓاْ إِنَّكُمۡ أَنتُمُ ٱلظَّٰلِمُونَ﴿٦٤

64వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: "నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు!"

ثُمَّ نُكِسُواْ عَلَىٰ رُءُوسِهِمۡ لَقَدۡ عَلِمۡتَ مَا هَٰٓؤُلَآءِ يَنطِقُونَ﴿٦٥

65కాని, తరువాత వారి బుద్ధి తలక్రిందులై వారు ఇలా అన్నారు: "వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!"

قَالَ أَفَتَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكُمۡ شَيۡـٔٗا وَلَا يَضُرُّكُمۡ﴿٦٦

66(ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "అలా అయితే! మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?

أُفّٖ لَّكُمۡ وَلِمَا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِۚ أَفَلَا تَعۡقِلُونَ﴿٦٧

67"ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయోగించరా?"

قَالُواْ حَرِّقُوهُ وَٱنصُرُوٓاْ ءَالِهَتَكُمۡ إِن كُنتُمۡ فَٰعِلِينَ﴿٦٨

68వారన్నారు: "మీరేమైనా చేయ దలుచుకుంటే! ఇతనిని కాల్చి వేయండి, మీ ఆరాధ్యదైవాలకు తోడ్పడండి."

قُلۡنَا يَٰنَارُ كُونِي بَرۡدٗا وَسَلَٰمًا عَلَىٰٓ إِبۡرَٰهِيمَ﴿٦٩

69మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: "ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!"[1]

وَأَرَادُواْ بِهِۦ كَيۡدٗا فَجَعَلۡنَٰهُمُ ٱلۡأَخۡسَرِينَ﴿٧٠

70మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తల పెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము.

وَنَجَّيۡنَٰهُ وَلُوطًا إِلَى ٱلۡأَرۡضِ ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَا لِلۡعَٰلَمِينَ﴿٧١

71మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూత్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము.[1]

وَوَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَ نَافِلَةٗۖ وَكُلّٗا جَعَلۡنَا صَٰلِحِينَ﴿٧٢

72మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము.[1] మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.

وَجَعَلۡنَٰهُمۡ أَئِمَّةٗ يَهۡدُونَ بِأَمۡرِنَا وَأَوۡحَيۡنَآ إِلَيۡهِمۡ فِعۡلَ ٱلۡخَيۡرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِۖ وَكَانُواْ لَنَا عَٰبِدِينَ﴿٧٣

73మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు.

وَلُوطًا ءَاتَيۡنَٰهُ حُكۡمٗا وَعِلۡمٗا وَنَجَّيۡنَٰهُ مِنَ ٱلۡقَرۡيَةِ ٱلَّتِي كَانَت تَّعۡمَلُ ٱلۡخَبَٰٓئِثَۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمَ سَوۡءٖ فَٰسِقِينَ﴿٧٤

74మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు[1] వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.

وَأَدۡخَلۡنَٰهُ فِي رَحۡمَتِنَآۖ إِنَّهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ﴿٧٥

75మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు.

وَنُوحًا إِذۡ نَادَىٰ مِن قَبۡلُ فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ﴿٧٦

76మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్[1] అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.

وَنَصَرۡنَٰهُ مِنَ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَآۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمَ سَوۡءٖ فَأَغۡرَقۡنَٰهُمۡ أَجۡمَعِينَ﴿٧٧

77మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచి వేశాము.

وَدَاوُۥدَ وَسُلَيۡمَٰنَ إِذۡ يَحۡكُمَانِ فِي ٱلۡحَرۡثِ إِذۡ نَفَشَتۡ فِيهِ غَنَمُ ٱلۡقَوۡمِ وَكُنَّا لِحُكۡمِهِمۡ شَٰهِدِينَ﴿٧٨

78మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి):[1] "ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.

فَفَهَّمۡنَٰهَا سُلَيۡمَٰنَۚ وَكُلًّا ءَاتَيۡنَا حُكۡمٗا وَعِلۡمٗاۚ وَسَخَّرۡنَا مَعَ دَاوُۥدَ ٱلۡجِبَالَ يُسَبِّحۡنَ وَٱلطَّيۡرَۚ وَكُنَّا فَٰعِلِينَ﴿٧٩

79అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము.[1] మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము.

وَعَلَّمۡنَٰهُ صَنۡعَةَ لَبُوسٖ لَّكُمۡ لِتُحۡصِنَكُم مِّنۢ بَأۡسِكُمۡۖ فَهَلۡ أَنتُمۡ شَٰكِرُونَ﴿٨٠

80మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా?

وَلِسُلَيۡمَٰنَ ٱلرِّيحَ عَاصِفَةٗ تَجۡرِي بِأَمۡرِهِۦٓ إِلَى ٱلۡأَرۡضِ ٱلَّتِي بَٰرَكۡنَا فِيهَاۚ وَكُنَّا بِكُلِّ شَيۡءٍ عَٰلِمِينَ﴿٨١

81మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది.[1] మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

وَمِنَ ٱلشَّيَٰطِينِ مَن يَغُوصُونَ لَهُۥ وَيَعۡمَلُونَ عَمَلٗا دُونَ ذَٰلِكَۖ وَكُنَّا لَهُمۡ حَٰفِظِينَ﴿٨٢

82మరియు షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము.

۞ وَأَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلضُّرُّ وَأَنتَ أَرۡحَمُ ٱلرَّٰحِمِينَ﴿٨٣

83మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు.!"[1]

فَٱسۡتَجَبۡنَا لَهُۥ فَكَشَفۡنَا مَا بِهِۦ مِن ضُرّٖۖ وَءَاتَيۡنَٰهُ أَهۡلَهُۥ وَمِثۡلَهُم مَّعَهُمۡ رَحۡمَةٗ مِّنۡ عِندِنَا وَذِكۡرَىٰ لِلۡعَٰبِدِينَ﴿٨٤

84అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము.

وَإِسۡمَٰعِيلَ وَإِدۡرِيسَ وَذَا ٱلۡكِفۡلِۖ كُلّٞ مِّنَ ٱلصَّٰبِرِينَ﴿٨٥

85మరియు (జ్ఞాపకం చేసుకోండి), ఇస్మాయీల్, ఇద్రీస్ మరియు జుల్కిప్ల్,[1] వీరందరు కూడా సహన శీలురైన వారే!

وَأَدۡخَلۡنَٰهُمۡ فِي رَحۡمَتِنَآۖ إِنَّهُم مِّنَ ٱلصَّٰلِحِينَ﴿٨٦

86మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా, వారందరూ సద్వర్తనులు.

وَذَا ٱلنُّونِ إِذ ذَّهَبَ مُغَٰضِبٗا فَظَنَّ أَن لَّن نَّقۡدِرَ عَلَيۡهِ فَنَادَىٰ فِي ٱلظُّلُمَٰتِ أَن لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبۡحَٰنَكَ إِنِّي كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ﴿٨٧

87మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్)[1] - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: "వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను."

فَٱسۡتَجَبۡنَا لَهُۥ وَنَجَّيۡنَٰهُ مِنَ ٱلۡغَمِّۚ وَكَذَٰلِكَ نُـۨجِي ٱلۡمُؤۡمِنِينَ﴿٨٨

88అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము.

وَزَكَرِيَّآ إِذۡ نَادَىٰ رَبَّهُۥ رَبِّ لَا تَذَرۡنِي فَرۡدٗا وَأَنتَ خَيۡرُ ٱلۡوَٰرِثِينَ﴿٨٩

89మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా[1] తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!"

فَٱسۡتَجَبۡنَا لَهُۥ وَوَهَبۡنَا لَهُۥ يَحۡيَىٰ وَأَصۡلَحۡنَا لَهُۥ زَوۡجَهُۥٓۚ إِنَّهُمۡ كَانُواْ يُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِ وَيَدۡعُونَنَا رَغَبٗا وَرَهَبٗاۖ وَكَانُواْ لَنَا خَٰشِعِينَ﴿٩٠

90అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, అతనికి యహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు.

وَٱلَّتِيٓ أَحۡصَنَتۡ فَرۡجَهَا فَنَفَخۡنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلۡنَٰهَا وَٱبۡنَهَآ ءَايَةٗ لِّلۡعَٰلَمِينَ﴿٩١

91మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూహ్) ఊది, ఆమెను మరియు ఆమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.[1]

إِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَأَنَا۠ رَبُّكُمۡ فَٱعۡبُدُونِ﴿٩٢

92నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం[1] మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.

وَتَقَطَّعُوٓاْ أَمۡرَهُم بَيۡنَهُمۡۖ كُلٌّ إِلَيۡنَا رَٰجِعُونَ﴿٩٣

93కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది.

فَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤۡمِنٞ فَلَا كُفۡرَانَ لِسَعۡيِهِۦ وَإِنَّا لَهُۥ كَٰتِبُونَ﴿٩٤

94సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.

وَحَرَٰمٌ عَلَىٰ قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَآ أَنَّهُمۡ لَا يَرۡجِعُونَ﴿٩٥

95మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి)పై, వారు (ఆ నగరవాసులు) మరలి రావటం నిషేధించబడింది.

حَتَّىٰٓ إِذَا فُتِحَتۡ يَأۡجُوجُ وَمَأۡجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٖ يَنسِلُونَ﴿٩٦

96ఎంత వరకైతే యాజూజ్ మరియు మాజూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో![1]

وَٱقۡتَرَبَ ٱلۡوَعۡدُ ٱلۡحَقُّ فَإِذَا هِيَ شَٰخِصَةٌ أَبۡصَٰرُ ٱلَّذِينَ كَفَرُواْ يَٰوَيۡلَنَا قَدۡ كُنَّا فِي غَفۡلَةٖ مِّنۡ هَٰذَا بَلۡ كُنَّا ظَٰلِمِينَ﴿٩٧

97మరియు సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్యతిరస్కారుల కళ్ళు విచ్చుకుపోయి: "అయ్యో! మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్ధకు గురి అయ్యాము. కాదు కాదు! మేము దుర్మార్గులముగా ఉండేవారము." అని అంటారు.

إِنَّكُمۡ وَمَا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمۡ لَهَا وَٰرِدُونَ﴿٩٨

98(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.[1]

لَوۡ كَانَ هَٰٓؤُلَآءِ ءَالِهَةٗ مَّا وَرَدُوهَاۖ وَكُلّٞ فِيهَا خَٰلِدُونَ﴿٩٩

99ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి వుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!"

لَهُمۡ فِيهَا زَفِيرٞ وَهُمۡ فِيهَا لَا يَسۡمَعُونَ﴿١٠٠

100అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.[1]

إِنَّ ٱلَّذِينَ سَبَقَتۡ لَهُم مِّنَّا ٱلۡحُسۡنَىٰٓ أُوْلَٰٓئِكَ عَنۡهَا مُبۡعَدُونَ﴿١٠١

101నిశ్చయంగా, ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు.

لَا يَسۡمَعُونَ حَسِيسَهَاۖ وَهُمۡ فِي مَا ٱشۡتَهَتۡ أَنفُسُهُمۡ خَٰلِدُونَ﴿١٠٢

102వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు.

لَا يَحۡزُنُهُمُ ٱلۡفَزَعُ ٱلۡأَكۡبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ هَٰذَا يَوۡمُكُمُ ٱلَّذِي كُنتُمۡ تُوعَدُونَ﴿١٠٣

103ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు[1] మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు.

يَوۡمَ نَطۡوِي ٱلسَّمَآءَ كَطَيِّ ٱلسِّجِلِّ لِلۡكُتُبِۚ كَمَا بَدَأۡنَآ أَوَّلَ خَلۡقٖ نُّعِيدُهُۥۚ وَعۡدًا عَلَيۡنَآۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ﴿١٠٤

104(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము.[1] మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.

وَلَقَدۡ كَتَبۡنَا فِي ٱلزَّبُورِ مِنۢ بَعۡدِ ٱلذِّكۡرِ أَنَّ ٱلۡأَرۡضَ يَرِثُهَا عِبَادِيَ ٱلصَّٰلِحُونَ﴿١٠٥

105వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి[1] సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.

إِنَّ فِي هَٰذَا لَبَلَٰغٗا لِّقَوۡمٍ عَٰبِدِينَ﴿١٠٦

106నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది.[1]

وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا رَحۡمَةٗ لِّلۡعَٰلَمِينَ﴿١٠٧

107మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.[1]

قُلۡ إِنَّمَا يُوحَىٰٓ إِلَيَّ أَنَّمَآ إِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ فَهَلۡ أَنتُم مُّسۡلِمُونَ﴿١٠٨

108(ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

فَإِن تَوَلَّوۡاْ فَقُلۡ ءَاذَنتُكُمۡ عَلَىٰ سَوَآءٖۖ وَإِنۡ أَدۡرِيٓ أَقَرِيبٌ أَم بَعِيدٞ مَّا تُوعَدُونَ﴿١٠٩

109ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు."

إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ مِنَ ٱلۡقَوۡلِ وَيَعۡلَمُ مَا تَكۡتُمُونَ﴿١١٠

110నిశ్చయంగా, ఆయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్త పరిచేది మరియు దాచేది అంతా తెలుసు.

وَإِنۡ أَدۡرِي لَعَلَّهُۥ فِتۡنَةٞ لَّكُمۡ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ﴿١١١

111మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు!

قَٰلَ رَبِّ ٱحۡكُم بِٱلۡحَقِّۗ وَرَبُّنَا ٱلرَّحۡمَٰنُ ٱلۡمُسۡتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ﴿١١٢

112అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది.!"

RELATED SURAHS